వాట్సప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. దూరప్రాంత బస్ సర్వీసులు అన్నింటా వాట్సప్ ద్వారా టికెట్ బుకింగ్‌కు అవకాశం కల్పించినట్లు పేర్కొంది. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల అధికారులు, డిపో మేనేజర్లకు ఆదేశాలిచ్చింది. వాట్సప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవల్లో భాగంగా 9552300009 నంబరుకు తొలుత హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ తర్వాత ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది. అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్/రద్దు అనేది ఎంపిక చేసుకోవాలి. అందులో బయలుదేరే ప్రదేశం, గమ్యస్థానం, తేదీ వంటివన్నీ టైప్ చేస్తే ఏయే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి, సీట్ల వివరాలు చూపిస్తుంది. వీటిలో సీట్లు ఎంపిక చేసుకొని ఆన్‌లైన్, డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది. వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తి వాట్సప్ నంబరుకు టికెట్ వస్తుంది.
వాట్సప్ బుకింగ్ లపై ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ !
February 02, 2025
0
Tags