ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి హాజరయ్యే విదేశీయులను డబ్బు కోసం కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖోరసన్ ప్రావిన్సు (ఐఎస్‌కేపీ) కుట్ర పన్నుతున్నట్టు పాక్ నిఘా విభాగం (ఐబీ) హెచ్చరిక జారీ చేసింది. ఎయిర్‌పోర్టులు, రేవులు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలలో నిఘా వేస్తూ చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చే విదేశీయులను లక్ష్యంగా చేసుకోవాలని ఈ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నినట్టు హెచ్చరించింది. పాకిస్థాన్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీపై ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లుగా సమాచారం అందుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి హాజరవుతున్న విదేశీయులను కిడ్నాప్ చేయడానికి 'కుట్ర' జరుగుతుందని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ హెచ్చరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెహ్రీక్-ఇ తాలిబన్ పాకిస్తాన్, ఐఎస్ఐఎస్, బలూచిస్తాన్ ఆధారిత ఇతర గ్రూపులు సహా అనేక ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నినట్లుగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ పేర్కొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. విదేశీ అతిథులే లక్ష్యంగా ఈ కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో సోమవారం భద్రతా దళాలను హెచ్చరించింది. యాక్టివ్ కోవర్ట్ గ్రూపులు కుట్రకు తెరతీశాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
చాంపియన్స్ ట్రోఫీలో విదేశీయుల కిడ్నాప్‌కు ఐఎస్ కుట్ర ?
February 25, 2025
0
Tags