మధ్యప్రదేశ్‌లో రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న హిందాల్కో ఇండస్ట్రీస్‌ !

Telugu Lo Computer
0


దిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన ప్రముఖ సంస్థ 'హిందాల్కో ఇండస్ట్రీస్‌', వచ్చే రెండేళ్లలో రూ.15 వేల పెట్టుబడులు పెట్టేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. భోపాల్‌లో జరిగిన మధ్యప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2025లో ఈ పెట్టుబడి ప్రకటన చేసింది. హిందాల్కో..మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న రూ.25 వేల కోట్ల విలువైన పెట్టుబడులతో ప్రధానంగా సింగ్రౌలీ జిల్లాలో ఉన్న 'మహన్‌'లోని ప్రపంచ స్థాయి అల్యూమినియం స్మెల్టర్‌పై దృష్టి సారించింది. హిందాల్కోతో పాటు అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గ్రాసింకు సంబంధించిన VSF డివిజిన్‌ వంటి ఇతర ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థలు కూడా మధ్యప్రదేశ్‌లో తమ ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాయి. హిందాల్కో విస్తరణ ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరుగుతుందని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం భావిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)