కర్ణాటకలో 100 మెగావాట్ల పవన ఇంధన ప్రాజెక్ట్ కోసం క్లీన్‌మాక్స్ సంస్థ అమెజాన్ తో విద్యుత్ ఒప్పందంపై సంతకం చేసినట్లు ఈరోజు తెలిపింది. అమెజాన్‌తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌లో భాగంగా కర్ణాటకలోని కొప్పల్‌లో పవన ఇంధన ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసి నిర్వహిస్తామని క్లీన్‌మాక్స్ తెలిపింది. క్లీన్‌మాక్స్ ఇక్కడ ఏటా 355 మిలియన్ KWh విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నేషనల్ గ్రిడ్‌కు అనుసంధానమయి అమెజాన్ కార్యకలాపాలకు విద్యుత్ శక్తిని అందిస్తుంది. 'క్లీన్‌మాక్స్' వాణిజ్య, పారిశ్రామిక రంగంలో ఆసియాలోని ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థల్లో ఒకటిగా పేరుగాంచింది. ఈ సంస్థ భారత్‌తో పాటు మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా అంతటా తన ఉనికిని కలిగి ఉంది. ఇది అత్యంత నైపుణ్యతతో కూడిన వృత్తిపరమైన బృందంతో 2 గిగావాట్ల (ఆపరేటింగ్) పునరుత్పాదక ఆస్తులను కలిగి ఉంది.
అమెజాన్‌తో క్లీన్‌మాక్స్ పవన విద్యుత్ ఒప్పందం
February 06, 2025
0
Tags