హెక్సావేర్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఇనీషియల్ ఫిబ్రవరి 12వ తేదీన దేశీయ స్టాక్ మార్కెట్‌లోకి పబ్లిక్ ఆఫరింగ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. 12న ప్రారంభమై 14న ముగుస్తుంది. ఒక్కో షేరు ధర రూ.674 నుంచి రూ. 708గా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కనీసం 21 ఈక్విటీ షేర్లకు, ఆ తర్వాత 21 షేర్ల గుణిజాల్లో దరఖాస్తు చేయొచ్చు. ఇపీవోలో భాగంగా ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ సెల్లింగ్ షేర్‌హోల్డరు సీఏ మ్యాగ్నం హోల్డింగ్స్ రూ. 8,750 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనుంది. ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో లిస్ట్ చేయబడతాయి. హెక్సావేర్ టెక్నాలజీస్ సంస్థ అనేది గ్లోబల్ డిజిటల్, టెక్నాలజీ సర్వీసెస్‌ను అందిస్తోంది. ఫార్చూన్ 500 కంపెనీల్లో 31 కంపెనీలకు సేవలందిస్తోంది. అమెరికా, యూరప్, భారత్, పశ్చిమాసియా ప్రాంతాల్లో కస్టమర్లు ఉన్నారు. ఈ కంపెనీ గత ప్రమోటర్ అయిన బేరింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఆసియా.. 2020లో ఈ కంపెనీని డీలిస్ట్ చేసింది. 2021 అక్టోబర్‌లో బేరింగ్ ఈక్విటీ సంస్థ నుంచి కార్లైల్ గ్రూప్ కొనుగోలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఈ కంపెనీ రూ.853 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంతో పాటు.. రూ.8,820 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్, క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ మేనేజర్లుగా వ్యవరిస్తున్నాయి. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, సిటీగ్రూప్, గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జేపీ మోర్గాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్ (గతంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లిమిటెడ్) ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.