లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడుతూ ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగిస్తామని చెప్పారు. ప్రజల కష్టాలు తెలిసిన వారికే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాలుగు కోట్ల మందికి పక్కా ఇళ్లు నిర్మించామని, 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు కట్టించామని, ఐదేళ్లలో 12 కోట్ల మందికి మంచినీటి సౌకర్యం కల్పించామని చెప్పారు. మేము ఎన్నికల్లో తప్పుడు హామీ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదని మండిపడ్డారు. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పుకొచ్చారు. గతంలో స్కామ్‌లు గురించి వినేవాళ్లమని, కానీ ఇప్పుడు స్కామ్‌లు లేవు అని చెప్పారు. ప్రపంచ గేమింగ్ రాజధానిగా భారత్ మారుతోందని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు ఎన్నికల వేళ హామీలు ఇస్తున్నాయని, తప్పుడు హామీలు ఇచ్చి యువతను మోసం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీల్ని తప్పకుండా నెరవేర్చుతుందని, రాజ్యంగం అంటే బీజేపీకి ప్రాణమని, రాజ్యాంగం విలువలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ప్రజల సొమ్ము ప్రజలకే ఉపయోగిస్తాం : ప్రధాని మోడీ
February 04, 2025
0
Tags