మోడీ ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు !

Telugu Lo Computer
0


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఉగ్ర బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మోడీ విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడి జరగొచ్చని తమకు సమాచారం వచ్చినట్లు ముంబయి పోలీసులు వెల్లడించారు. ''ఫిబ్రవరి 11న ముంబయి పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న మోడీ విమానంపై ఉగ్రవాదులు దాడి జరగొచ్చు అని అవతలి వ్యక్తి బెదిరించారు. సమాచారంలో ఉన్న తీవ్రత దృష్ట్యా మేం వెంటనే ఇతర దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేశాం. కాల్‌ చేసిన వ్యక్తి ఎవరనే దానిపై దర్యాప్తు చేపట్టాం'' అని ముంబయి పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు అనంతరం ఫోన్‌ కాల్‌ చేసిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు వెల్లడించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని మోడీ సోమవారం నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయల్దేరారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉన్న ఆయన కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సులో పాల్గొన్నారు. పారిస్‌ పర్యటనను ముగించుకొని నేడు అమెరికా బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈసందర్భంగా అమెరికా నూతన అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ కానున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)