ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాల లిస్ట్ ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ విడుదల చేసింది. అవినీతిలో 2024లో ఏఏ దేశాలు ముందున్నాయి. ఏ ఏ దేశాలు తక్కువ కరప్షన్ తో ఉన్నాయో ర్యాంకింగ్స్ ఇచ్చారు. మొత్తం 180 దేశాలకు సంబంధించిన లిస్టును 0-100 వరకు ర్యాంకులతో పాటు స్కోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కువ స్కోర్ వచ్చిన దేశాలు తక్కువ కరప్షన్ ఉన్నట్లు, అదే విధంగా తక్కువ ర్యాంక్ ఉన్న దేశాలలో ఎక్కువ కరప్షన్ ఉన్నట్లు. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ బెర్లిన్ లో కరప్షన్ పర్సప్షన్స్ ఇండెక్స్ ఆధారంగా ఈ లిస్టు విడుదల చేసింది. రిపోర్టు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా అవినీతి అతిపెద్ద సమస్యగా మారింది. అయితే 2012 నుంచి 2024 వరకు 32 దేశాలు అవినీతిని తగ్గించుకున్నాయి. కరప్షన్ తగ్గించేందుకు 148 దేశాలు ఇంకా శ్రమించాల్సి ఉంది. ఇందులో రెండులో మూడొంతుల దేశాలు 50 స్కోర్ కు కిందనే ఉన్నాయని రిపోర్ట్ పేర్కొంది. తక్కువ కరప్షన్ ఉన్న దేశాలలో రిపోర్టు ప్రకారం డెన్మార్క్ దేశం 90 ర్యాంక్ తో టాప్ లో ఉంది. ఆ తర్వాత ఫిన్ లాండ్ (88), సింగపూర్ (84), న్యూజీలాండ్ (83), లక్జెంబర్గ్ (81), నార్వే (81), స్విట్జర్లాండ్(81), స్వీడన్ (80), నెదర్లాండ్స్ (78), ఆస్ట్రేలియా (77). ఎక్కువ కరప్షన్ ఉన్న దేశాలలో కేవలం 8 పాయింట్ల స్కోర్ తో, లాస్ట్ ర్యాంక్ (180) తో సౌత్ సుడాన్ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత సోమాలియా (179), వెనుజులా (178), సిరియా (177) తదితర దేశాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, అంతర్గత యుద్ధాలతో అతలాకుతలం అవుతున్న పాకిస్తాన్ 27 స్కోర్ తో 135వ స్థానంలో ఉంది. 2023తో పోల్చితే 2 స్థానాలు తగ్గింది. ఇక ఇండియా 2023 తో పోల్చితే 3 స్థానాలు తగ్గింది. 38 పాయింట్లతో 96 ర్యాంక్ లో ఉంది.
అత్యంత అవినీతి దేశం సౌత్ సుడాన్ - అవినీతి తక్కువ ఉన్న దేశం డెన్మార్క్
February 12, 2025
0
Tags