బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారడంతో భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక చేసింది. ఈ తుఫాను కారణంగా దేశంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారత దేశంలోని రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఫిబ్రవరి 19న ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అస్సాం, మేఘాలయలో ఫిబ్రవరి 19న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కింలో రానున్న వారం రోజులు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 17 నుంచి 19 లోపు రాజస్థాన్లో, పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతాల్లో ఫిబ్రవరి 19, 20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగాళాఖాతంలో అల్లకల్లోలం - వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక జారీ
February 17, 2025
0
Tags