తెలంగాణ మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలు  ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పులు అవసరమైనా వాటిని కూడా ఆన్ లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్ లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ సమీపంలోని మీసేవ కేంద్రాలను సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటికీ కొనసాగుతుందని.. దీనికి ఒక నిర్ధిష్టమైన గడువు లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పెరిగింది. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికీ రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ.. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)