ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై అన్ని ధ్రువపత్రాలు మొబైల్ ఫోన్‌లోనే జారీ చేయనున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ తెలిపారు. ఇందుకోసం ప్రతి పౌరుడికి డిజిలాకర్ సదుపాయం కల్పిస్తామని, అన్ని పత్రాలను వాట్సప్‌లోనే డౌన్‌లోడ్ చేసుకొనే సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. శుక్రవారం వాట్సప్ గవర్నెన్స్‌పై ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ సమీక్ష నిర్వహించారు. ''డేటా అనుసంధానంతో పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. డేటా అనుసంధాన ప్రక్రియను వెంటనే పూర్తి చేస్తున్నాం. తద్వారా వాట్సప్ ద్వారానే ప్రభుత్వానికి అర్జీలు, ఫిర్యాదులు చేసే అవకాశం ఉంటుంది. చదువురాని వాళ్లు వాయిస్ మెసేజ్ ద్వారా అర్జీలు, ఫిర్యాదులు చేసేందుకు అవకాశం కల్పిస్తాం. ప్రతి శాఖలో చీఫ్ డేటా టెక్నికల్ అధికారిని నియమించేలా చర్యలు తీసుకుంటాం. నిరంతరాయ సేవల కోసం ఆర్టీజీఎస్ ద్వారా డేటా లేక్ ఏర్పాటు చేస్తాం'' అని భాస్కర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పౌరుడికి డిజిలాకర్ !
February 07, 2025
0
Tags