రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌

Telugu Lo Computer
0


పీఎల్ 2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ను ప్రకటించింది. యువ ఆటగాడు రజత్ పాటిదార్‌కు నాయకత్వ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్‌మెంట్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. పాటిదార్ 2021 నుంచి ఆర్‌సీబీ జట్టులో భాగంగా ఉన్నాడు. ఇటీవల మెగా వేలానికి కన్నా ముందు ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ముగ్గురు ఆటగాళ్లలో అతడు ఒకడు. ఇప్పటి వరకు పాటిదార్ ఐపీఎల్‌లో 27 మ్యాచ్‌లు ఆడి 34.7 సగటుతో 158.8 స్ట్రైక్‌రేటుతో 799 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 7 అర్థశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 112. పాటిదార్‌కు కొంత కెప్టెన్సీ అనుభవం ఉంది. 2024-2025 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మధ్యప్రదేశ్‌కు నాయకత్వం వహించాడు. తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. 9 ఇన్నింగ్స్‌ల్లో 428 పరుగులతో టోర్నీలో రెండో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగానూ నిలిచాడు.




Post a Comment

0Comments

Post a Comment (0)