డీప్ సీక్ పై దక్షిణ కొరియా నిషేధం విధించింది. ఆ దేశ రక్షణ, వాణిజ్య కంప్యూటర్లలో డీప్సీక్ వాడకాన్ని నిషేధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. డీప్సీక్ వినియోగంపై పలు దేశాల నుంచి వస్తున్న ఆందోళనల నేపథ్యంలోనే దాన్ని నిషేధించాలని నిర్ణయించుకున్నాం. ఇంటెలిజెన్స్ అధికారులు దీని వినియోగంలో జాగ్రత్తలు వహించాలి. యూజర్లకు చెందిన వ్యక్తిగత సమాచార సేకరణ వ్యవస్థకు సంబంధించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయి అని రక్షణ, వాణిజ్య మంత్రిత్వశాఖలు సంయుక్తంగా తెలియజేశాయి. ఆ దేశ పర్యావరణ మంత్రిత్వశాఖ కూడా ఇదే హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం.
డీప్ సీక్ పై దక్షిణ కొరియా నిషేధం !
February 06, 2025
0
Tags