నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను జగన్ ఖండించారు. అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆయన భార్య పోసాని కుసుమలతకు ఫోన్ చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ పాలన నిరంకుశంగా సాగుతోందని, ఈ అరెస్ట్ విషయంలో పోసాని కృష్ణమురళికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న వ్యవహారాలను ప్రజలు, దేవుడు చూస్తున్నారని తెలిపారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. అలాగే పోసాని కృష్ణమురళికి వైసీపీ తరుఫున న్యాయ పరంగా సహాయం అందిస్తామని ఆయన భార్యకు జగన్ హామీ ఇచ్చారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులకు ఈ వ్యవహారాన్ని అప్పగించామని జగన్ ఆమెకు తెలిపారు. ఆలోపు మనోధైర్యంతో ఉండాలని ఆమెకు సూచించారు. మరోవైపు పోసాని అరెస్టుపై జగన్ వైసీపీలో సీనియర్ నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. టీడీపీలో జీవీ రెడ్డి ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న ఈ అరెస్టు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వారితో జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇవాళ అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ కు తీసుకువచ్చి పోసాానిని ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుుకు పోలీసులు సిద్దమవుతున్న నేపథ్యంలో వైసీపీ లాయర్లు అక్కడికి బయలుదేరినట్లు తెలుస్తోంది.
పోసాని కృష్ణమురళి అరెస్ట్ ను ఖండించిన జగన్ !
February 27, 2025
0
Tags