ఫలించని ఆర్మీ రెస్క్యూ టీమ్‌ ప్రయత్నం !

Telugu Lo Computer
0


ఎస్ఎల్బీసీ టన్నెల్‌ చిక్కుకున్న కార్మికుల జాడ ఇన్ని రోజులైనా తెలియడంలేదు. ఫోన్ సిగ్నల్స్ కూడా అందటం లేదు. ఇప్పటికే ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ తో పాటు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌, స్నీప్పర్‌ డాగ్స్‌ సహాయం తీసుకుని కూడా ప్రయత్నాలు చేశారు. అయినా ఆ కార్మికుల జాడ కనిపెట్టలేకపోతున్నారు. ఫోన్ సిగ్నల్స్ కూడా అందటం లేదు. ఇప్పటికే ఎస్డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ తో పాటు ర్యాట్‌ హోల్‌ మైనర్స్‌, స్నీప్పర్‌ డాగ్స్‌ సహాయం తీసుకుని కూడా ప్రయత్నాలు చేశారు. అయినా ఆ కార్మికుల జాడ కనిపెట్టలేకపోతున్నారు. ఎన్ని బృందాలుగా వెళ్లిన చివరి వరకు చేరుకోలేక పోయారు. అయితే నిన్న మాత్రం ఆర్మీ రెస్క్యూ టీమ్‌ టన్నెల్‌ చివర వరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. శిథిలాలు తొలగిస్తే టన్నెల్‌ మళ్లీ కుప్పకూలే ప్రమాదం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఘటన జరిగిన సమయం నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తోపాటు ప్రముఖులు అంత అక్కడే మకాం వేశారు. ఎలాగైనా కార్మికులను ప్రాణాలు కాపాడాలని శాయశక్తుల ప్రయత్నిస్తూనే ఉన్నారు.. ఈ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్, స్నీప్పర్ డాగ్, ర్యాట్‌ హోల్ మైనర్స్‌ సహాయంతో కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. కుదరకపోవడంతో ఆర్మీని రంగంలోకి దించారు. ఆర్మీ రెస్క్యూ టీం నిన్న టన్నెల్‌ చివరి వరకు వెళ్లగలిగింది. రిస్క్యూ పనులు మరింత వేగవంతం చేశామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో తెలిపారు. 200 మీటర్ల మేరకు మట్టి, నీరు కలిసి బురద పేరుకుపోవడంతో కార్మికులను బయటకు తీయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పూర్తిస్థాయిలో నీటిని కూడా తీసివేసే పనుల్లో ఉన్నారు. టన్నెల్‌లో చిక్కుకుపోయిన వారిని కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం ఉందని అన్నారు. భారీగా నీరు బురద నిలిచిపోవడంతో వారిని కాపాడలేక ఇబ్బంది అడ్డంకులు వస్తున్నాయన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)