తుంగభద్ర నదిలో కొట్టుకుపోయిన హైదరాబాద్‌కు చెందిన మహిళా డాక్టర్ !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో గల తుంగభద్ర నదిలో ఈత కొట్టడానికి దూకిన హైదరాబాద్‌కు చెందిన మహిళా డాక్టర్ అనన్య రావు  నదిలో కొట్టుకుపోయారు. ఆమె స్నేహితులతో విహారయాత్రకు వెళ్లారు.  తోటి స్నేహితుల సమాచారం మేరకు అనన్య రావు కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయం తెలియడంతో మహిళా డాక్టర్ కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)