రాజస్థాన్‌కు చెందిన 17 ఏళ్ల యువ మహిళా పవర్ లిఫ్టర్ యష్టిక ఆచార్య వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయింది. రోజూలాగే ప్రాక్టీస్ చేస్తున్న ఆమె జిమ్‌లో 270 కిలోల బరువున్న రాడ్డును ఎత్తబోయింది. ఎంతో కష్టపడి దాన్ని పైకెత్తగా ప్రమాదవశాత్తు అది జారి తన మెడపైనే పడింది. ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గతంలో జూనియర్ నేషనల్ గేమ్స్‌లో స్వర్ణ పతక విజేతగా నిలిచిన ఆమె మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. కూతురు మరణం గురించి తెలుసుకున్న యశ్తికా తల్లిదండ్రులు నేరుగా ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ ఘటనలో ట్రైనర్‌కు గాయాలైనాయి. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లను తనిఖీ చేశామని, ఇది యష్టిక మరణానికి ప్రాక్టీస్ ప్రమాదమే కారణమని నిర్ధారించిందని నయా షహర్ పోలీస్ స్టేషన్ అధికారి విక్రమ్ తివారీ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబం కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదని, పోస్ట్‌మార్టం చేయించుకోవాలని కోరుకోవడం లేదని తివారీ అన్నారు.
ప్రమాదవశాత్తు యువ వెయిట్ లిఫ్టర్ మృతి !
February 20, 2025
0
Tags