కర్ణాటకలో EV బ్యాటరీ టెస్టింగ్, అధునాతన మెటీరియల్స్ కోసం..తయారీ, పరిశోధనా సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి రూ.15,350 కోట్ల పెట్టుబడి పెట్టే ప్రణాళికను ఎప్సిలాన్ ఈ రోజు ప్రకటించింది. బెంగళూరులో జరిగిన ఇన్వెస్ట్ కర్ణాటక సమ్మిట్‌లో ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎప్సిలాన్ తెలిపింది. ఈ వ్యూహాత్మక పెట్టుబడి, రాబోయే 10 ఏళ్లలో దశలవారిగా జరుగుతుంది. అధునాతన బ్యాటరీ సాంకేతికత కేంద్రంగా భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తామని 'ఎప్సిలాన్ గ్రూప్' పేర్కొంది. అవగాహన ఒప్పందంలో భాగంగా, ఎప్పిలాన్ గ్రూప్, దాని అనుబంధ సంస్థలైన ఎప్పిలాన్ అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్, ఎప్సిలాన్ క్యామ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి స్థిరమైన, అధిక పనితీరు గల గ్రాఫైట్ యానోడ్, లిథియం ఐరన్ ఫాస్పేట్ కాథోడ్ బ్యాటరీ ఉత్పత్తులను తయారుచేస్తుంది. గ్రాఫైట్ యానోడ్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు రూ.9 వేల కోట్లు, ఎల్‌ఎఫ్‌పీ కాథోడ్ తయారీ ప్లాంట్‌కు రూ.6 వేల కోట్లు, బ్యాటరీ మెటీరియల్స్, బ్యాటరీ టెస్టింగ్ R&D, శిక్షణా కేంద్రం కోసం రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. చైనా దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, స్థానిక బ్యాటరీ మెటీరియల్ ఎకోసిస్టంను నిర్మించడంలో తమ పెట్టుబడి కీలకమైన అడుగు అని ఎప్సిలాన్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'విక్రమ్ హండా' తెలిపారు. ఈ పెట్టుబడి..దేశీయ, అంతర్జాతీయ EV తయారీదారులకు కీలకమైన బ్యాటరీ మెటీరియల్స్ సరఫరాను మెరుగుపరుస్తుందని, భారత్‌ను గ్లోబల్ బ్యాటరీ హబ్‌గా మారుస్తుందని కంపెనీ తెలిపింది.
కర్ణాటక ప్రభుత్వంతో ఎప్సిలాన్ గ్రూప్ అవగాహన ఒప్పందం
February 12, 2025
0
Tags