శ్రీశైలం లిఫ్ట్ బకింగ్ కెనాల్ టన్నెల్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాలు సూచించాయి. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ మెషీన్ ద్వారా మట్టి లో కూరుకుపోయిన ఐదు మృతదేహాలు గుర్తించారు. మృతదేహాలను వెలికి తీయడానికి మరింత సమయం పడుతుందని, కొన్ని మీటర్ల లోతు మట్టి లో మృతదేహాలు కూరుకు పోయినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురి మృతదేహాల కోసం కొనసాగుతున్న అధికారులు గాలిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవ సమాధి !
February 28, 2025
0
Tags