విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే అధికార్లు తెలిపారు. సికింద్రాబాద్ డివిజన్ మీదుగా కాజీపేట, విజయవాడ సెక్షన్‌లోని ఖమ్మం స్టేషన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు జరగకపోవడంతో పలు రద్దుతోపాటు మళ్లింపు ట్రాక్ దారి గుండా రైళ్లు నడుస్తాయన్నారు. ఈనెల 12 నుంచి 20 వరకు విశాఖపట్నం నుంచి బయలుదేరే రైలు 18519 విశాఖపట్నం ఎల్‌టిటి ఎక్స్‌ప్రెస్ రద్దు చేస్తామని తెలిపారు. ఈనెల 12 నుంచి 22 వరకు ఎలేటి నుంచి బయలుదేరే రైలు నెంబర్ 18520 ఎల్‌టిటి విశాఖపట్నం టు ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడుతుందన్నారు. ఈనెల 13న టాటా నగర్ నుంచి బయలుదేరే రైలు 18111 టాటా నగర్ టు యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడుతుందని, రైలు నెంబర్ 18122 యశ్వంతపూర్ టు టాటా నగర్ ఈనెల 9న, 16వ తేదీల్లో యశ్వంతపూర్ నుంచి బయలుదేరే ఎక్స్‌ప్రెస్ రద్దు చేయబడుతుందన్నారు. ఈనెల 17 నుంచి 19 వరకు షాలిమార్ నుంచి బయలుదేరే రైలు 18045 షాలిమార్ టు హైదరాబాద్ ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ టు గుంటూరు, పగిడిపల్లి టు సికింద్రాబాద్ మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తుందన్నారు. ఈనెల 18 నుంచి 20 వరకు హైదరాబాద్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 16046 హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్, పగిడిపల్లి టు గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లింపు మార్గంలో నడుస్తుందన్నారు. రైలు నెంబర్ 11019 సిఎస్‌టి ముంబై టు భువనేశ్వర్ సిఎస్‌టి ముంబై నుంచి ఈనెల 17 నుంచి 19 వరకు వాడి, వికారాబాద్, సికింద్రాబాద్, గుంటూరు, విజయవాడ మీదుగా మళ్లించిన మార్గంలో నడుస్తుందన్నారు. రైలు నెంబర్ 11020 భువనేశ్వర్ సిఎస్‌టి ముంబై ఈనెల 17 నుంచి 19 వరకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, వికారాబాద్, వాడి మీదుగా దారి మళ్లించిన మార్గంలో నడుస్తుందన్నారు. వివిధ రైళ్లు స్టాపులు కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర రెండు దిశలలో స్టాపులు తొలగించినట్లు రైల్వే అధికార్లు ప్రకటించారు. ఈనెల 19న షాలిమార్ నుండి బయలుదేరే రైలు నెంబర్ 22849 షాలిమార్ టు సికిందరాబాద్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్ మీదుగా మళ్లించిన మార్గంలో నడుస్తుందనీ ఈస్ట్ కోస్ట్ రైల్వే సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ తెలిపారు.
భద్రతా పనుల కారణంగా పలు రైలు రద్దు, దారి మళ్లింపు !
February 12, 2025
0
Tags