అమెరికా 'బ్లాక్‌మెయిల్‌'కు పాల్పడుతోంది !

Telugu Lo Computer
0


మెరికా ఫెంటనిల్‌ అంశాన్ని వాడుకుంటూ సుంకాల పేరుతో ఒత్తిడి చేయడంతోపాటు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని చైనా ఆరోపించింది. చైనా దిగుమతులపై 10శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో డ్రాగన్‌ ఈ విధంగా స్పందించింది. ''టారిఫ్‌ ఒత్తిడిలు, బ్లాక్‌మెయిల్‌ కోసం ఫెంటనిల్‌ అంశాన్ని అమెరికా వాడుకుంటోంది. ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా, ఒత్తిడి, నిర్బంధం, మాదకద్రవ్యాల నియంత్రణలో ఇరుదేశాల మధ్య చర్చలు, సంప్రదింపులకు ముప్పుగా మారుతుంది'' అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాంగ్‌ పేర్కొన్నారు. అయితే, పరిస్థితులు మారకుంటే ఈ చర్యలకు ఎదురుదెబ్బ తప్పదని హెచ్చరించారు. అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి మార్కో రుబియో కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ చైనాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫెంటనిల్‌పై చైనా రివర్స్‌ యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే అమెరికాలోకి దానిని పెద్దఎత్తున పంపిణీ చేస్తుండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. చైనా కామర్స్‌ మినిస్ట్రీ స్పందిస్తూ.. అత్యంత కఠినమైన మాదక ద్రవ్యాల నిరోధక విధానాలు అమలు చేస్తున్నామని పేర్కొంది. వీలైనంత త్వరగా అమెరికా చర్చలు జరపాలని చూస్తున్నామని, లేదంటే ప్రతీకారం తప్పదని హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)