చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 20 మంది దాడి ఆయనపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగరాజన్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. రంగరాజన్‌పై దాడి అత్యంత దుర్మార్గం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రంగరాజన్ పై జరిగిన దాడిని తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. రంగరాజన్‌పై దాడి అత్యంత దుర్మార్గం అని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని మండిపడ్డారు. అలాగే రంగరాజన్‌ను అవమానిస్తే దేవుడిని అవమానించడమేనని, ఆయనపై దాడికి పాల్పడిన నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేటీఆర్ కోరారు. చిలుకూరు బాలాజీ ఆలయం దగ్గర భద్రత పెంచాలని ప్రభుత్వానికి, పోలీసులకు కేటీఆర్ విజ్ఙప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున తాము రంగరాజన్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రంగరాజన్‌ను పరామర్శించిన కేటీఆర్ !
February 10, 2025
0
Tags