పాట్నా ఐఐటీలో హైదరాబాద్ విద్యార్థి ఆత్మహత్య !

Telugu Lo Computer
0


బీహార్ లోని పాట్నా ఐఐటీలో హైదరాబాద్ కు చెందిన విద్యార్థి రాహుల్ లావారి  కాలేజీ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఐఐటీ పాట్నా డైరెక్టర్ ప్రొఫెసర్ టీఎన్ సింగ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. రాహుల్ ఐఐటీ పాట్నా క్యాంపస్‌లో కంప్యూటర్ సైన్స్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ ఘటనపై ఐఐటీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ వివేక్ కుమార్ స్పందించారు. "ఐఐటీ పాట్నా క్యాంపస్​లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు మాకు సమాచారం వచ్చింది.వెంటనే మా టీమ్ క్యాంపస్​, అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఆత్మహత్యకు వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతాం" అని అన్నారు. ఇటీవల సిలబస్, సెమిస్టర్‌లో చాలా మార్పులు జరిగాయని, అందువల్లే పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతోనే ఇలా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని మిగతా విద్యార్థులు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు జరిపి నిజానిజాలు వెలికి తీయాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ మృతిపై అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే ఈ ఘటనపై క్యాంపస్ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)