అమరావతి ఓఆర్ఆర్ భూసేకరణకు అధికారుల నియామకం !

Telugu Lo Computer
0


మరావతి ఓఆర్ఆర్  భూసేకరణకు సంబంధించి అధికారులుగా ఐదు జిల్లాలకు జాయింట్ కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. పల్నాడు, గుంటూరుతో పాటు ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భూ సేకరణకు జేసీలను అధికారులుగా నియమించారు. ఐదు జిల్లాల్లోని 23 మండలాల్లో, 121 గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ నిర్మాణం జరగనుంది. అమరావతి ఓఆర్ఆర్ మొత్తం 189.9 కిలోమీటర్ల పొడవు ఉండనుంది. తెలంగాణలో హైదరాబాద్ ఓఆర్ఆర్ కంటే ఇది ఎక్కువ పొడువు. భూ సేకరణకు అధికారులను నియమించి, మరోవైపు ఎన్ హెచ్ఏఐ ప్రతిపాదిత ఎలైన్ మెంట్లో ప్రభుత్వం మార్పులు చేర్పులతో ఆమోదం తెలపనుంది. అమరావతి ఓఆర్ఆర్ ఏ జిల్లాల్లో ఏ గ్రామాల నుంచి వెళ్తుందని స్థానిక ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)