ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అధికారిక ఓటీటీ బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న జియో హాట్‌స్టార్ భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా అత్యధిక కంకరెంట్ వ్యూస్‌ను నమోదు చేసింది. విరాట్ కోహ్లీ సంచలన బ్యాటింగ్‌తో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంతో జియోహాట్ స్టార్ పంట పండింది. ఈ మ్యాచ్‌లో గరిష్టంగా 61 కోట్ల కంకరెంట్ వ్యూస్ నమోదయ్యాయి. క్రికెట్ చరిత్రలోనే ఇది ఆల్‌టైల్ రికార్డ్. కోహ్లీ సెంచరీతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయలాంఛనం పూర్తి చేసుకోవడం బ్రాడ్‌కాస్టర్స్‌కు కలిసొచ్చింది. కంకరెంట్ వ్యూస్ అంటే ఒకే సమయంలో వచ్చే వ్యూస్ సంఖ్య. సింపుల్‌గా చెప్పాలంటే రియల్‌టైమ్ యూజర్ల సంఖ్య. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏకకాలంలో 61 కోట్ల మంది జియో హాట్ స్టార్ యాప్ వేదికగా వీక్షించారు. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయగా.. హాట్‌స్టార్ వ్యూస్ 10 కోట్లు ఉంది. పాక్ ఇన్నింగ్స్ చివర్లో ఈ సంఖ్య 40 కోట్లకు చేరగా.. భారత్ బ్యాటింగ్ సందర్భంగా 55 కోట్లకు చేరింది. విరాట్ కోహ్లీ శతకం సమయంలో 61 కోట్లకు పెరిగింది. ఇది ఓటీటీ యాప్ చరిత్రలోనే ఆల్‌టైమ్ రికార్డ్. ఇదే టోర్నీలో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గరిష్టంగా 35 కోట్ల వ్యూస్ వచ్చాయి. తాజాగా భారత్-పాక్ మ్యాచ్ ఆ రికార్డ్‌ను తిరగరాసింది.
ఏకకాలంలో 61 కోట్ల మంది జియో హాట్ స్టార్ యాప్ వేదికగా వీక్షణ !
February 24, 2025
0
Tags