అనకాపల్లిలో కుమారుడితో కలిసి మహిళా హోంగార్డు ఆత్మహత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అట్టా ఝాన్సీ తన ఆరేళ్ల కుమారుడు దినేశ్‌ కార్తీక్‌తో కలిసి ఏలేరు కాలువలో దూకారు. భర్త అచ్యుతరావు అలియాస్‌ విజయ్‌ వేధిస్తుండటంతో శుక్రవారం కశింకోటలోని ఇంటి నుంచి కుమారుడితో సహా బయటకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఏలేరు కాలువలో మృతదేహాలు లభ్యం కావడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడు అచ్యుతరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)