ఎయిరిండియా 'నమస్తే వరల్డ్ సేల్' పేరిట విమాన టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణానికి టికెట్లపై రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు ఈ సేల్ నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 21 నుంచి అక్టోబర్ 31 మధ్య ప్రయాణం కోసం బుక్ చేసే టికెట్లపైనే (ఎంపిక చేసిన రూట్లలో) ఈ ఆఫర్ వర్తిస్తుంది. దేశీయ ప్రయాణానికి ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.1,499 నుంచే ప్రారంభమవుతాయని ఎయిరిండియాతెలిపింది. బిజినెస్ క్లాస్ ధరలు రూ.9,999 నుంచి మొదలవుతాయని పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణానికి ఎకానమీ క్లాస్‌లో రూ.12,577, బిజినెస్ క్లాస్‌లో రూ.20,870 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఎయిరిండియా వెబ్‌సైట్, యాప్ నుంచి బుక్ చేసుకొనే దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఎటువంటి కన్వినియన్స్ రుసుము వసూలు చేయబోమని తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, బీఓబీ బ్యాంక్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే కేటగిరీని బట్టి అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చని తెలిపింది. లిమిటెడ్ సీట్లకు, తొలుత బుక్ చేసుకున్న వారికే ఆఫర్స్ వర్తిస్తాయని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది.
ఎయిరిండియా 'నమస్తే వరల్డ్ సేల్' పేరిట విమాన టికెట్లపై ఆఫర్లు !
February 02, 2025
0
Tags