ఏప్రిల్, మే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలు వాడీవాడిగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు పథకాలపై ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము అమలు చేసిన పథకాలన్నీ కూటమి ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టేసిందని ఆరోపించాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ స్పందించి సమాధానం ఇచ్చారు. శాసనమండలి సాక్షిగా చెప్తున్నా ఏప్రిల్, మే నెలల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తున్నామని ప్రకటన చేశారు. ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది బడ్జెట్ తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల పథకాలు ప్రారంభమవుతాయని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు. అలాగే కీలకమైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను జూన్ లోపు అమలు చేయాలని నిర్ణయించారు. తల్లికి వందనం పథకాన్ని విద్యాసంవత్సరం ప్రారంభంలోపే ఇచ్చేయాలని అధికారులకు ఆదేశించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)