కుంభమేళా నుంచి వస్తుండగా ఎంపీ మహువా మాజీ కారు ప్రమాదం

Telugu Lo Computer
0


జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్‌ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని NH-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆమెను రాంచీలోకి రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)