ఐసీసీ ర్యాంకింగ్ లో మళ్లీ రెండో స్థానానికి పడిపోయిన భారత్ !

Telugu Lo Computer
0


సీసీ ర్యాంకింగ్ లో భారత్ మళ్లీ రెండో స్థానానికి పడిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లపై విజయం సాధించి సెమీస్‌కు దూసుకువెళ్లిపోయింది. ఆదివారం దుబాయ్ వేదికగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. సోమవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించడంతో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. న్యూజిల్యాండ్ సైతం ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలవగా ఆ జట్టు ఖాతాలో కూడా నాలుగు పాయింట్లే ఉన్నాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్ బెర్తులను ఖాయం చేసుకున్నాయి. ఇదే గ్రూప్ లో ఉన్న పాకిస్తాన్ , బంగ్లాదేశ్ లు ఇంటిముకం పట్టాయి. అటు గ్రూప్ _బి లో ప్రస్తుతం సౌతిఫ్రికా , ఆస్ట్రేలియా జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కాగా గ్రూప్‌-బి నుంచి ఇంకా సెమీస్ చేరుకునే జట్లు ఏవో ఇంకా ఖరారు కాలేదు. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడినప్పటికి ఇంగ్లాండ్ ను సైతం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఆ జట్టు మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కాబట్టి.. దక్షిణాప్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లలో రెండు జట్లు సెమీస్‌కు చేరుకునే అవకాశం ఉంది. భారత్ జట్టు టేబుల్ టాపర్ గా సెమీస్ కు చేరుకుంటే గ్రూప్ _బి లో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)