చర్లపల్లి రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని చర్లపల్లి పారిశ్రామిక వాడలోని శేషసాయి రసాయన పరిశ్రమలో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు చుట్టుపక్కల పరిశ్రమలకు వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మహాలక్ష్మి రబ్బర్‌ కంపెనీకి మంటలు అంటుకోవడంతో రసాయనాల ఘాటుతో స్థానికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)