మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉన్న వారిలో 2022-24 మధ్యకాలంలో 1.55 కోట్ల మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయమంత్రి కమలేశ్ పాసవాన్ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 86,17,887 మంది, 2023-24లో 68,86,532 మంది కార్మికుల పేర్లను తొలగించినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రెండేళ్లలో మొత్తంగా 1,55,04,419 మంది కార్మికుల పేర్లను తొలగించామన్నారు. నకిలీ, తప్పుడు జాబ్ కార్డులు, గ్రామాల నుంచి కార్మికుల కుటుంబాలు తరలిపోవడం లేదా సంబంధిత గ్రామాలను పట్టణాలుగా వర్గీకరించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా చెప్పారు.
రెండేళ్లలో ఉపాధి హామీ పథకం నుంచి 1.55కోట్ల మంది తొలగింపు !
February 04, 2025
0
Tags