త్రివేణి సంగంలో నీటిని తాగొచ్చు: సీఎం యోగి ఆదిత్యనాథ్

Telugu Lo Computer
0


గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఆ చోటు ఎంతో పవిత్రమైందని ఆ నీళ్లను తాగొచ్చని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సనాతన ధర్మం, గంగామాతపై ఫేక్ వీడియోలు, వార్తలు వైరల్ చేస్తున్నారని మండిపడ్డారు. నీటిని పరిశీలించిన  సీపీసీబీ అందులో బ్యాక్టీరియా ఉందని, స్నానానికి పనికిరాని ఎన్జీటీకి నివేదిక సమర్పించింది.ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద జనవరి 13న మహాకుంభ మేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 26 వరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాలని యూపీ ప్రభుత్వం నిర్ణయించింది. మహా కుంభమేళాకు 45 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. అయితే ఊహకందని రీతిలో ఇప్పటికే 56 కోట్ల మంది భక్తులు విచ్చేశారు. మరో 7 రోజులు మిగిలి ఉండడంతో భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)