అబ్దుల్లాపూర్ మెట్ లో 300 కిలోల గంజాయి పట్టివేత

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో గురువారం అధికారులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ కు  తరలించే క్రమంలో ముందస్తు సమాచారంతో మహేశ్వరం ఎస్వోటీ, అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. 300 కిలోల గంజాయి, కంటైనర్ ను   పట్టుకొని సీజ్ చేశారు. తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ. కోటి ఉంటుందని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)