ఆంధ్రప్రదేశ్ లో ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో ఐదు వేల మంది డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్ నెట్స్ అందిస్తామని చెప్పారు. ఒక్కో షెడ్ వ్యయం రూ.3.22 లక్షలు ఉండగా సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పారు. జాతీయ జీవనోపాధుల పథకం కింద రాష్ట్రానికి రూ.1,000 కోట్లు కేంద్ర నిధులు పొందనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్
February 06, 2025
0
Tags