మైసూర్ క్యాంపస్ నుంచి 400 మంది ట్రైనీ ఇంజనీర్లను తొలగించిన ఇన్ఫోసిస్‌ !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని మైసూర్ క్యాంపస్ నుంచి 400 మంది ట్రైనీ ఇంజనీర్లను ఇన్ఫోసిస్‌ తొలగించింది. కంపెనీ ఈ ఆఫర్ లెటర్‌లను సైతం పంపింది. కంపెనీ ఈ ఉద్యోగుల ఫోన్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ట్రైనీలుగా చేరిన వారిలో కూడా సగం మందిపై వేటు పడినట్లు సమాచారం.ఈ ట్రైనీ ఇంజనీర్లు వరుసగా నిర్వహించిన మూడు ఎవాల్యుయేషన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేదని, అందుకే తొలగించినట్లు సంబంధిత వర్గాల నుంచి సమాచారం అందింది. కానీ కంపెనీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడ లేదు. తొలగించిన వారందరినీ సిస్టమ్ ఇంజనీర్స్, డిజిటల్ స్పెషలిస్ట్ ఇంజనీర్స్ పోస్టులకు నియమించారు. ఈ సందర్భంగా పలువురు ట్రైనీ ఇంజనీర్లు స్పందించారు. ” ఈ పరీక్షలు చాలా కఠినమైనవి. మమ్మల్ని ఫెయిల్ చేయడానికి కావాలనే ఈ పరీక్షలను పెట్టారు. ఇప్పుడు మా భవిష్యత్తు అంధకారంగా మారింది.” అని పేర్కొన్నారు. శిక్షణ పొందినవారు మొబైల్ ఫోన్లు తీసుకెళ్లకుండా చూసుకోవడానికి కంపెనీ బౌన్సర్లు, భద్రతా సిబ్బందిని నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. తొలగించిన వాళ్లు సాయంత్రం 6 గంటలలోపు ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని కంపెనీ అల్టిమేటం జారీ చేసింది. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు అధికారికం ఫిర్యాదు చేస్తామని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ తెలిపింది. 




Post a Comment

0Comments

Post a Comment (0)