వల్లభనేని వంశీ రిమాండ్‌ మార్చి 11 వరకు పొడిగింపు

Telugu Lo Computer
0


న్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. గతంలో విధించిన రిమాండ్‌ గడువు నేటితో ముగియనుండటంతో జైలు నుంచే వంశీని వర్చువల్‌గా జడ్జి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. అనంతరం న్యాయమూర్తి మార్చి 11 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. నేటి నుంచి వంశీని మూడు రోజుల కస్టడీకి పోలీసులు తీసుకున్నారు. జైలు వద్దకు పటమట పోలీసులు చేరుకుని వంశీని కస్టడీలోకి తీసుకుని భారీ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో వైద్య పరీక్షలకు తరలించారు. ఆయన్ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్న సమయంలో డ్రోన్‌ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షించారు. సత్యవర్ధన్‌ స్టేట్‌మెంట్‌ ఆధారంగా వంశీని విచారించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)