ఏఎస్‌ఐ స్మారక చిహ్నాల జాబితా టాప్‌ 10లో చార్మినార్‌ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని చార్మినార్‌ ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) స్మారక చిహ్నాల జాబితా టాప్‌ 10లో చోటు దక్కించుకుంది. అంతేకాదు అత్యధిక సంఖ్యలో భారతీయ సందర్శకులను ఆకట్టుకుని వార్షిక పెరుగుదలలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిచింది. గత 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జాబితాలో చార్మినార్‌ 9వ స్థానంలో నిలిచింది. దేశీయ పర్యాటకుల సంఖ్య 2022-23లో 9.29లక్షలు కాగా, గత ఏడాది 2023-24 కల్లా 12.9లక్షలకు పెరిగింది. సందర్శకుల సంఖ్యలో పెరుగుదల 38 శాతానికి పైగా ఉండడంతో అన్ని ఏఎస్‌ఐ స్మారక చిహా్నల్లో కలిపి 10.8 శాతంగా ఉన్న మొత్తం కంటే ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఏఎస్‌ఐ స్మారక చిహా్నల్లో మొత్తం దేశీయ పర్యాటకుల సంఖ్య 479.01 లక్షలు కాగా ఇది 2023-24లో 530.9 లక్షలకు పెరిగింది. చార్మినార్‌తో పాటు, గోల్కొండ కోట కూడా అత్యధిక భారతీయ సందర్శకులను సాధించిన స్మారక చిహ్నాల జాబితాలో చోటు సంపాదించింది. ఈ చారిత్రక స్మారక చిహ్నాన్ని 2022-23లో 15.27 లక్షల మంది సందర్శించగా, 2023-24లో 5 శాతానికి పైగా పెరిగి 16.08 లక్షల మంది సందర్శించారు. ఇక అత్యధిక భారతీయ సందర్శకులను ఆకట్టుకున్న టాప్‌ 10 స్మారక చిహ్నాల జాబితాలో తాజ్‌ మహల్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ ఏడాది 20 శాతానికి పైగా సందర్శకుల సంఖ్యను పెంచుకుంది. అయితే ఇది చార్మినార్‌ పెరుగుదలతో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం.

Post a Comment

0Comments

Post a Comment (0)