హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఆరాంఘర్ ఫ్లైఓవర్ పై బైక్ డివైడర్ ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం అర్ధరాత్రి రాత్రి ఒంటి గంటకు ప్రమాదం జరిగింది. పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఈ మైనర్ బాలురు బహదూర్ పురా నుంచి ఆరాంఘర్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రమాదానికి గురైంది. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన ఈ ఆరాంఘర్ ఫ్లైఓవర్ ను జనవరి మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో భాగంగా జూ పార్క్ నుంచి ఆరాంఘర్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర ఫ్లై ఓవర్ నిర్మించారు.
ఆరాంఘర్ ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం : ముగ్గురు మృతి
January 28, 2025
0
Tags