రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు. వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఈ నిర్ణయం తీసుకుంది.తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లలోకి పదహారేళ్ల లోపు పిల్లలకు అనుమతి నిషేధం !
January 28, 2025
0
Tags