మీ నిర్ణయాన్ని ఆమోదించకపోయినప్పటికీ గౌరవిస్తామని విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ ఎక్స్ లో పోస్టు !

Telugu Lo Computer
0

విజయసాయిరెడ్డి రాజీనామా పోస్ట్ పై ఎక్స్ లో వైసీపీ పార్టీ స్పందించింది. మేము మీ నిర్ణయాన్ని ఆమోదించక పోయినప్పటికీ గౌరవిస్తాము. వైసీపీ ఆవిర్భావం నుంచి కష్ట సమయాల్లోనూ, విజయాల్లోనూ మాతో పాటు నిలబడిన మీరు పార్టీకి బలమైన మూలస్తంభాలలో ఒకరు. అయితే హార్టికల్చర్‌ లో మీ అభిరుచిని కొనసాగించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాలనే మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాము. మీ అభిప్రాయాలు ఎల్లప్పుడూ గౌరవించబడతాయి. మీ భవిష్యత్ ప్రయత్నాలలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాము అని పేర్కొంది. అయితే ఏరియాజు ఉదయం తన పదవికి విజయసాయి రెడ్డి రాజీనామా చేయగా దానిని ఆమోదించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనకర్. విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించినట్లు పేర్కొంటూ బులిటెన్ విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)