కర్ణాటక లోని మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా సింధువళ్లి గ్రామం వద్ద ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలి తల తెగిన దుర్మరణం చెందింది. గుండ్లుపేటె తాలూకా బేగూరు సమీపంలోని ఆలహళ్లి గ్రామ నివాసి శివలింగమ్మ మైసూరు నుంచి గుండ్లుపేటెకు నంజనగూడు మీదుగా వెళుతున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. సింధువళ్లి గ్రామం వద్ద మహిళ బస్సు కిటికీలో నుంచి తల బయట పెట్టింది, అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ లారీ, బస్సును రాసుకుంటూ వెళ్లిపోయింది. దీంతో శివలింగమ్మ తల, కుడి చేయి తెగి రోడ్డు మీద పడిపోయాయి ఆమె సీట్లోనే ప్రాణాలు విడిచింది. అది చూసి బస్సులోని ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. టిప్పర్ డ్రైవర్ వాహనంతో పరారయ్యాడు. నంజనగూడు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పీఎస్‌ఐ సిద్దరాజు, సిబ్బంది మహేంద్ర స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ బస్సును సీజ్ చేశారు. మహిళ మృతదేహాన్ని కేఆర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు.
బస్సు కిటికిలోంచి ప్రయాణికురాలి చూస్తుండగా దూసుకొచ్చిన టిప్పర్ : తల తెగి దుర్మరణం !
January 26, 2025
0
Tags