మహిళల అండర్ 19 ప్రపంచ కప్ 2025 లో భాగంగా ఈ రోజు బంగ్లాదేశ్, భారత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో భారత్ భారీ విజయం సాధించింది. సూపర్ సిక్స్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకోవడంతో బంగ్లా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లు వచ్చిన వారు వచ్చినట్లే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ఆడిన బంగ్లాదేశ్ జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 64 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ మూడు, షబ్నం షకీల్, గొంగడి త్రిష ఒక్కో వికెట్ తీసుకొగా, మరో ఇద్దరు రనౌట్ అయ్యారు. 65 పరుగుల స్వల్ప లక్ష్యంతో దిగిన భారత బ్యాటర్లు రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
సూపర్ సిక్స్ లో బంగ్లాదేశ్ పై భారత్ జట్టు భారీ విజయం !
January 26, 2025
0
Tags