తిరుమల రెండో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం

Telugu Lo Computer
0


తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు పిట్ట గోడను ఢీకొన్నది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది దాకా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. వీరిలో పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా హుటాహుటిన దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేసి, స్విమ్స్ కు తరలించారు. ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోవడంతో.. తీవ్రంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ తొలగించే చర్యలు చేపట్టారు. కాగా ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)