హైదరాబాద్ లో రైలుకింద పడి విద్యార్థిని ఆత్మహత్య

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని ఆంద్ర మహిళా సభ కళాశాలలో సీఈసీ విభాగం రెండవ సంవత్సరం అభ్యసిస్తున్న విద్యార్థిని భార్గవి కాలేజ్ వెనుకనే ఉన్న రైల్ పట్టాలపై ఆత్మహత్య చేసుకుంది. భార్గవి స్వస్థలం సిద్దిపేట జిల్లా, పెద్ద కోడూరు గ్రామం. సంఘటన స్థలానికి ఆంధ్ర మహిళ సభ విద్యార్థులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఈ ఉదయం 7గంటలకు ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. కన్నీరుమున్నీరుగా భార్గవి స్నేహితులు విలపిస్తున్నారు. ఈ ఘటనలో యువతి తల ఛిద్రమైంది. యువతి ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)