ఆంధ్రప్రదేశ్ లోని నరసరావుపేటకు చెందిన ఉదయ్ కిరణ్ ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిస అయ్యాడు. గేమ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు తీవ్రంగా అప్పులు చేశాడు. దాదాపు రూ.10 లక్షల మేర అప్పు చేసి ఆ డబ్బంతా బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. అప్పు తీర్చలేక సోమవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి స్వస్థలం ప్రకాశం జిల్లా బల్లికురవ గ్రామం. కొంతకాలంగా నరసరావు పేటలో నివాసం ఉంటున్నాడు. కిరణ్ ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఆన్ లైన్ బెట్టింగ్ బారిన పడి వ్యక్తి ఆత్మహత్య
January 21, 2025
0
Tags