భారత విద్యారంగం సర్టిఫికేట్ల వ్యవస్థగా మారింది !

Telugu Lo Computer
0


ధ్యప్రదేశ్‌లోని మహులో నిర్వహించిన సభలో పాల్గొన్న కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ రాజ్యాంగంపై దాడికి పాల్పడుతున్నారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తోంది. దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వం నాటి పరిస్థితులను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ మళ్లీ కోరుకుంటున్నాయి. దళితులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు, పేదలను మరోసారి బానిసలుగా మారుస్తున్నాయి. రాజ్యాంగం మారిన రోజు ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు ఉండవని అన్నారు. ఈ సందర్భంగా రాహుల్ దేశ విద్యా వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ''ప్రైవేటు వ్యవస్థలో విద్య, వైద్య రంగాల యాజమాన్యం ఎవరి చేతిలో ఉంది ? మన భారత విద్యా రంగం స్టాంపులు, సర్టిఫికేట్ల వ్యవస్థగా మారింది. సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగాలు వస్తాయని కోట్లాది మంది ప్రజలు భావిస్తున్నారు. ఇదంతా పచ్చి అబద్ధం. అలా చేస్తే మీ పిల్లలు దేశంలో ఎలాంటి ఉపాధి పొందలేరు. ఈ బిలియనీర్లు దేశ ఉపాధి వ్యవస్థను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)