ఆంధ్రప్రదేశ్ లో అందరికీ ఇళ్లు పథకం మార్గదర్శకాలు విడుదల !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అందరికీ ఇల్లు కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపుకు రెవెన్యూ శాఖ స్పెషల్ ఛీఫ్‌ సెక్రటరీ ఆర్పీ సిసోడియా జీవో ఎంస్ నెంబర్ 23 ను జారీ చేశారు. ఈ నిబంధనలను ఏపీ ఎస్‌హెచ్‌సీఎల్ అన్ని జిల్లా కలెక్టర్‌లకు పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అందరికీ ఇల్లు కార్యక్రమం మానిటరింగ్‌కు రెవెన్యూ మంత్రి ఛైర్మన్‌గా మున్సిపల్, హౌసింగ్‌లతో పాటు పలువురు అధికారులు సభ్యులుగా కమీటీ ఏర్పాటు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పట్టణాల్లో ప్రభుత్వ స్ధలం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇంట్లోని మహిళ పేరుతో కేటాయింపు. పట్టణాల్లో ప్రభుత్వ భూములు లభించని చోట ఏపీ టిడ్కో, యూఎల్బీ, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా నిర్మించి ఇవ్వాలని నిర్ణయం. ఇంటి స్ధలం, లేదా ఇల్లు పొందిన వారికి పూర్తి హక్కులు కేటాయించిన నాటి నుంచి 10 ఏళ్ల తరువాత లభిస్తాయని వెల్లడి. అర్హత కలిగిన వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే హౌస్ సైట్ పొందేందుకు అర్హుడు. పట్టా ఇచ్చిన రెండేళ్లలోగా ఇంటిని లబ్దిదారు నిర్మించుకోవాలి. ప్లాటును ఆధారు, రేషన్ కార్డులకు లింక్ చేయడం ద్వారా డూప్లికేషన్ లేకుండా చూడాలి. లబ్దిదారులు  తెల్లరేషన్ కార్డు కలిగి ఉండాలి, ఏపీలో ఎక్కడా సొంత ఇల్లు, స్థలం కలిగి ఉండకూడదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల నుండి ఎలాంటి ఇంటి స్ధలం పొంది ఉండకూడదు, కేంద్ర, రాష్ట్ర పభుత్వాల హౌసింగ్ స్కీంలలో దేనిలోనూ లబ్ది పొంది ఉండకూడదు. అయిదు ఎకరాలు మించి వ్యవసాయ భూమి మెట్ట, రెండున్నర ఎకరాలు జరీబు లేదా మెట్ట, జరీబు కలిపి 5 ఎకరాలకు మించకుండా భూమి ఉన్న వారు అర్హులు. ఇప్పటికే ఇంటి స్థలం జారీ చేయబడి కోర్టు కేసులలో ఉంటే వారికి ఆ స్థలాన్ని రద్దు చేసి వేరే చోట జారీ. గతంలో కేటాయించిన లే అవుట్ నగరానికి దూరంగా ఉండడం, శ్మశానాలకు దగ్గరగా ఉండడం, ముంపు ప్రాంతంలో ఉండడం వంటి సమస్యలు ఉంటే మొత్తం లే అవుట్ రద్దు చేసి వేరే చోట కేటాయించాలని నిర్ణయం. ఇప్పటికే ఇంటి స్థలం పొంది, ఇల్లు నిర్మించని వారికి ఆ సైట్ రద్దు చేసి వేరే చోట సైట్ కేటాయింపు. 

Post a Comment

0Comments

Post a Comment (0)