ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం మాచవరం గ్రామానికి చెందిన కర్రీ వెంకటరెడ్డి (దొరబాబు) మాచవరం గ్రామంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అతనికి అనేక మంది డబ్బులు వడ్డీకి ఇచ్ఛారు. మాచవరం, సోమేశ్వరం గ్రామాలతో పాటు అనపర్తి మండలం పులగుర్త, రామకోట గ్రామాలకు చెందిన 45 మంది దొరబాబు వద్ద డబ్బులు పెట్టారు. ఈ విధంగా సుమారు 4.5 కోట్ల రూపాయల వరకు దొరబాబు దగ్గర పొదుపు చేసినట్టు బాధితులు తెలిపారు. సుమారు మూడు నెలలుగా దాచుకున్న డబ్బులను తమ తిరిగి ఇవ్వాలని దొరబాబుని కోరినప్పటికీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాడు. మరోవైపు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో దొరబాబు ఇంటి వద్ద లేకుండా పోవడంతో బాధితులంతా దొరబాబు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తాము దాచుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలంటూ బాధితులు కోరుతున్నారు.
జనాలకు ఐపీ పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారి పరార్ !
January 27, 2025
0
Tags