ఏపీఎస్ ఆర్టీసీ మహాకుంభమేళా యాత్ర !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గం, రాజమహేంద్రవరం డిపోల నుంచి 11 రోజుల టూర్ ప్యాకేజీని ఏపీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. ఈ టూర్ లో 11 రోజుల్లో 13 క్షేత్రాలను దర్శించుకోవచ్చు. రాయదుర్గం డిపో నుంచి ఈ నెల 31వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు 11 రోజుల మహాకుంభమేళా యాత్ర ప్రారంభం అవుతుంది. విజయవాడ, అన్నవరం, భువనేశ్వర్, పూరి, కోణార్క్, ప్రయాగరాజ్, కుంభమేళా, వారణాసి, అయోధ్య, గయ, బుద్ధగయ, భద్రాచలం, త్రివేణి సంగమ స్నానం...ఈ ప్కాకేజీలో కవర్ చేస్తారు. ప్రయాగరాజ్, కాశీలో ఒక రోజు బస చేయవచ్చు. రాయదుర్గం నుంచి మహాకుంభమేళా టూర్ ప్యాకేజీలో ఒక్కరికి టికెట్ ధర రూ.14 వేలుగా నిర్ణయించారు. ఈ టూర్ లో ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్ఫాహారం అందిస్తారు. రాజమహేంద్రవరం డిపో నుంచి మహా కుంభమేళా యాత్ర ప్యాకేజీ అందిస్తుంది. 11 రోజుల్లో 13 క్షేత్రాలను దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి రోజున కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. సూపర్ లగ్జరీ బస్సులో ఫిబ్రవరి 18 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ టూర్ లో యాత్రికులకు ఉదయం అల్పహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం అందిస్తారు. ఒకరికి టికెట్టు వెల రూ.12,800గా నిర్ణయించారు. టిక్కెట్లు కావాల్సిన వారు ఈ 95023 00189, 9966666544, 9866045588 నెంబర్లు సంప్రదించవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)